ఉప్పల్లో డీసీఏ తనిఖీలు.. అనుమతుల్లేని గోడౌన్లో రూ.6.70 లక్షల ఔషధాలు సీజ్

ఉప్పల్లో డీసీఏ తనిఖీలు.. అనుమతుల్లేని గోడౌన్లో  రూ.6.70 లక్షల ఔషధాలు సీజ్

ఉప్పల్, వెలుగు: ఉప్పల్​లో డ్రగ్ కంట్రోల్ అధికారులు (డీసీఏ) బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లక్ష్మీనారాయణ నగర్ కాలనీలో డ్రగ్ లైసెన్స్ లేకుండా గోడౌన్ నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో ఈ తనిఖీలో చేపట్టారు. ఈ  గోడౌన్ లో ఆరు రకాల గడువు ముగిసిన ఔషధాలను గుర్తించి, సీజ్ చేశారు. వీటి విలువ రూ.6.70 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.

అద్దంకి వెంకటేష్, సురేశ్ బాబు అనే ఇద్దరు వ్యక్తలు ఈ గోడౌన్ నిర్వహిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.  ఈ దాడుల్లో డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్ (షామీర్​పేట) అంజూమ్ అబిదా, ఉప్పల్, షామీర్​పేట, మేడిపల్లి డ్రగ్ ఇన్స్​పెక్టర్లు డాక్టర్ బి.లక్ష్మినారాయణ, బి.ప్రవీణ్,
 పి.అంబేద్కర్ పాల్గొన్నారు.