హైదరాబాద్‎లో డీసీఏ జాయింట్ ఆపరేషన్.. భారీగా నార్కోటిక్ డ్రగ్స్ సీజ్

హైదరాబాద్‎లో డీసీఏ జాయింట్ ఆపరేషన్.. భారీగా నార్కోటిక్ డ్రగ్స్ సీజ్

హైదరాబాద్: తెలంగాణ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) హైదరాబాద్‎లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది.
ఈ ఆపరేషన్‎లో భాగంగా నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ నిల్వలు, అమ్మకాల నెట్‌వర్క్‌ను ఛేదించింది. సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లోని జీవీ సలూజా ఆసుపత్రిలో ప్రత్యేక ఆపరేషన్‌లో ఫెంటానిల్ ఇంజెక్షన్లు, కెటామైన్ ఇంజెక్షన్లు, పెంటాజోసిన్ ఇంజెక్షన్లు, మిడాజోలం ఇంజెక్షన్లు మొదలైన నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్ధాల భారీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..రాష్ట్రంలో మయోనైజ్ బ్యాన్

 మల్కాజిగిరిలోని మౌలాలికి చెందిన నేహా భగవత్ నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన నార్కోటిక్ డ్రగ్‌లను అధికారులు గుర్తించారు.  నేహా భగవత్ నుండి మార్ఫిన్ ఇంజెక్షన్లు, మార్ఫిన్ టాబ్లెట్లు, ఫెంటానిల్ ఇంజెక్షన్లు, ఫెంటానిల్ ప్యాచెస్, పెంటాజోసిన్ ఇంజెక్షన్లు మొదలైన వాటితో సహా భారీ నిల్వలు కూడా స్వాధీనం చేసుకున్నారు.