హైదరాబాద్ నగరంలో డీసీఏ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు ఏరియాల్లో ఉన్న హోల్ సేల్ గోడౌన్ లపై దాడులు చేసి బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన ఇన్సులిన్ ఇంజక్షన్స్ ని భారీగా సీజ్ చేశారు. పర్చేస్ బిల్స్ లేకుండా ఢిల్లీ నుంచి అక్రమంగా ఇన్సులిన్స్ తెప్పించుకుంటున్నట్టు గుర్తించారు. 40 శాతం డిస్కౌంట్ తో మార్కెట్ లో ఇన్సులిన్స్ అమ్ముతున్నట్టు నిర్ధారించారు.
హైదరాబాద్ లోని ఆరు హోల్ సేల్ వ్యాపారుల గోడౌన్స్ పై దాడులు చేసి రూ. 51 లక్షల విలువైన ఇన్సులిన్స్ ఇంజెక్షన్స్ ను సీజ్ చేశారు. బిల్స్ లేకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతూ ఇన్సులిన్స్ ని అమ్ముతున్నారని డీసీఏ అధికారులు వెల్లడించారు. 40 శాతం డిస్కౌంట్ తో అమ్ముతున్న ఇన్సులిన్స్ కల్తీవా అనే కోణంలో విచారణ చేపట్టారు.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రమంతటా మెడికల్ దందాలపై డీసీఏ అధికారులు దాడులు చేస్తున్నారు. రైడ్ చేసిన ప్రతి చోట అధికారులు భారీగా కల్తీని గుర్తిస్తున్నారు.