ప్రైవేట్​ దవాఖానలో నార్కొటిక్ ​డ్రగ్స్! ఆ రెండు హాస్పిటళ్లలో భారీగా నిల్వలు

ప్రైవేట్​ దవాఖానలో నార్కొటిక్ ​డ్రగ్స్! ఆ రెండు హాస్పిటళ్లలో భారీగా నిల్వలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: చాంద్రాయణగుట్ట బకోబన్ హాస్పిటల్, వారాసిగూడ బౌద్ధనగర్ లోని బీవీకే రెడ్డి దవాఖానలో ఎక్సైజ్, డ్రగ్ కంట్రోల్ (డీసీఏ)​ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. బకోబన్ హాస్పిటల్​లో 47, బీవీకే రెడ్డి దవాఖానలో 21 ఫెంటానిల్ ఇంజెక్షన్లు, 9 కేటామైన్, 2 మిడాజోలం ఇంజెక్షన్లతో సహా నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్ధాల భారీ నిల్వలను గుర్తించారు. 

రెండు హాస్పిటళ్లపై ఎన్డీపీఎస్​యాక్ట్ కింద చార్మినార్, ముషీరాబాద్ ఎక్సైజ్​ పోలీస్​స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. కేసు విచారణ కొనసాగుతుందని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్​ లో డ్రగ్, ఎక్సైజ్ సీఐలు లక్ష్మీ, గోవింద్​సింగ్, శ్రీనివాసరావు, రామకృష్ణ పాల్గొన్నారు.