యాదాద్రి, వెలుగు : దశాబ్ది దగా‘ కార్యక్రమం సందర్భంగా యాదాద్రిలో కాంగ్రెస్‌లోని విబేధాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. డీసీసీ, కోమటిరెడ్డి వర్గాలు వేర్వేరుగా ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించాయి. భువనగిరిలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తహసీల్దార్ఆఫీసు ఎదుట ధర్నా చేసి, పది తలలతో కూడిన కేసీఆర్ ఫ్లెక్సీని దహనం చేశారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గం లీడర్లు భువనగిరి ఆర్డీవో ఆఫీసు ఎదుట ధర్నా చేసి కేసీఆర్ ఫ్లెక్సీని దహనం చేసి నిరసన తెలిపారు. ఆలేరులో కోమటిరెడ్డి వర్గమైన బీర్ల అయిలయ్య నిర్వహించిన ధర్నాకు కొందరు లీడర్లు హాజరు కాలేదు.