నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను ప్రజా భవన్ గా మార్చుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నట్లుగానే నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాభవన్ లో దర్బార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లు 6 గ్యారంటీల్లో రెండింటిని ప్రారంభించిందన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని హాస్పిటళ్లలో రాజీవ్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని చెప్పారు. వైఎస్సార్ హయాంలో చేసిన పనులే కనిపిస్తున్నాయని, గత ప్రభుత్వం ఏం చేయలేదన్నారు. జడ్పీటీసీలు రోహిణి గోవర్ధన్ రెడ్డి, సుమిత్ర, కౌన్సిలర్ నిజాం, కోటయ్య, తైలి శ్రీనివాస్, హబీబ్ పాల్గొన్నారు.
వంగూరు: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవికి వంగూరు, చారగొండ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగూరు గేటు వద్ద ఘనస్వాగతం పలికారు. గజ మాలతో సత్కరించారు. పండిత్ రావు, కేవీఎన్ రెడ్డి, బలరాం గౌడ్, వెంకట్ గౌడ్, పాండురంగారెడ్డి, క్యామ మల్లయ్య, రమేశ్‌గౌడ్, కడారి మల్లయ్య యాదవ్, జనార్ధన్, రంగారావు, నరసింహారెడ్డి, నారాయణరెడ్డి, వెంకటయ్య యాదవ్, సందీప్ రెడ్డి, మోహన్, లాలయ్య పాల్గొన్నారు.
అచ్చంపేట: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అచ్చంపేట ప్రజలు స్వేచ్ఛను కోల్పోయారని పేర్కొన్నారు. ఇక నుంచి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. శ్రీనివాసులు, రాజేందర్, రామానందం, గౌరీ శంకర్, వెంకట్ రెడ్డి, సలేశ్వరం, రవికుమార్ గౌడ్, జమీల్, మాణిక్ బాబు, అల్వాల్ రెడ్డి, సంపంగి రమేశ్, ఎల్ల స్వామి, లింగస్వామి, కిశోర్ పాల్గొన్నారు.