యువత కోసం కాంగ్రెస్​ ప్రత్యేక పథకాలు : ఆది శ్రీనివాస్

వేములవాడరూరల్, వెలుగు : కాంగ్రెస్​ ప్రభుత్వం యువత కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టనుందని డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్​ అన్నారు. శనివారం చందుర్తి మండలం లింగంపేటకు చెందిన దాదాపు 40 మంది యువకులు  కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అనంతరం రుద్రంగి మండలంలో ఆది శ్రీనివాస్  ఇంటింటా ప్రచారం నిర్వహించి పథకాలపై అవగాహన కల్పించారు. జడ్పీటీసీ నాగం కుమార్, మండల అధ్యక్షుడు రామస్వామి, పులి సత్యం, ప్రభాకర్, గణేశ్‌‌‌‌, మనోహర్, మోహన్​రెడ్డి పాల్గొన్నారు.