ఎమ్మెల్యే సునీతా రెడ్డి తీరు అభ్యంతరకరం : ​ఆంజనేయులు

ఎమ్మెల్యే సునీతా రెడ్డి తీరు అభ్యంతరకరం : ​ఆంజనేయులు

డీసీసీ ప్రెసిడెంట్ ​ఆంజనేయులు

శివ్వంపేట,  వెలుగు: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరమని డీసీసీ ప్రెసిడెంట్​ఆంజనేయులు గౌడ్ అన్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్​లో మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. జనవరి 26న ప్రజా పాలన కార్యక్రమంలో సుహాసిని రెడ్డితో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అమర్యాదగా ప్రవర్తించడం సరికాదన్నారు.

సుహాసిని రెడ్డి మాట్లాడుతూ సాటి మహిళనైనా తనకే గౌరవం ఇవ్వని ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి గౌరవం ఇస్తారని ప్రశ్నించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ26 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సునీతా లక్ష్మారెడ్డి ఇతరుల బాధ్యతను గుర్తించకుండా హక్కుల గురించి పోరాడడం సరికాదన్నారు.