రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత వారికి లేదు :ఆంజనేయులు గౌడ్

  • డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్

 నర్సాపూర్, వెలుగు: రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ క్యాంప్ ఆఫీసులో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీశ్ రావు సర్పంచుల బిల్లులు దారి మళ్లించారని అన్నారని కానీ పదేళ్ల నుంచి ఆర్థిక మంత్రిగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. 

గ్రామపంచాయతీ వ్యవస్థను నాశనం చేసింది బీఆర్ఎస్​ ప్రభుత్వం అన్నారు.100పడకల నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని 75 పడకలకు చేసిన చరిత్ర హరీశ్ రావుదని విమర్శించారు. బీఆర్ఎస్ కు రూ.1500 కోట్ల నిధులు ఎలా వచ్చాయని నిలదీశారు.

 హరీశ్ రావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జ్యోతి, వెల్దుర్తి మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లలిత, బ్లాక్ అధ్యక్షుడు రిజ్వాన్, మండల అధ్యక్షుడు మల్లేశం పాల్గొన్నారు.

డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్