
- బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు
బెజ్జంకి, వెలుగు: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ప్రభుత్వం పనిచేస్తోందని డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో గడపగడపకూ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ప్రజలను తెలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని మహిళలు కోరగా త్వరలోనే బస్సు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అనంతరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే సమక్షంలో మాజీ ఎంపీపీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కు చెందిన బెజ్జంకి, తిమ్మయ్య పల్లి, బెజ్జంకి క్రాసింగ్ మాజీ సర్పంచ్ లు ద్యావనపల్లి మంజుల శ్రీనివాస్, కవ్వ లింగారెడ్డి, బొలెవేని రాజయ్యతోపాటు పద్మశాలి, ఆరే క్షత్రియ, వడ్డెర సంఘం నాయకులు, ఉప సర్పంచులు, వివిధ పార్టీ నుంచి వచ్చిన 200 మంది కాంగ్రెస్ లో చేరారు. వీరిని కండువాలు కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ నాయకులు పులి కృష్ణ, చెప్పాల శ్రీనివాస్ గౌడ్, మానాల రవి, డీవీ రావు, జల ప్రభాకర్, రావుల నర్సయ్య, శ్రీకాంత్, ఎర్రల రాజు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.