జనగామ, వెలుగు : జనగామ జిల్లా కేంద్రం శివారు సూర్యాపేట రోడ్ లోని భ్రమరాంబ ఫంక్షన్ హాల్లో ఈనెల 2న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. టీపీసీసీ చీఫ్బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ సమావేశానికి వరంగల్, భువనగిరి ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నలతోపాటు స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల ఇన్చార్జిలు సింగపురం ఇందిర, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నకులగణన, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై దిశా నిర్దేశం చేయనున్నట్లు చెప్పారు. సమావేశానికి పార్టీ వివిధ శాఖల కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీల పాలకవర్గ సభ్యులు, నాయకులు విధిగా హాజరై జయప్రదం
చేయాలని కోరారు.