లక్ష్మణచాంద, వెలుగు : బీఆర్ఎస్ సర్కారు గొప్పలు చెప్పుకోవడం తప్ప తొమ్మిదేండ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు విమర్శించారు. లక్ష్మణచాంద మండలంలోని తిరుపెల్లి గ్రామస్తులు బైరి శంకర్, బైరి గంగాధర్, బైరి కార్తీక్, ఓస బన్నీ, ప్రవీణ్, భూమన్న, శంకర్ తోపాటు పలువురు ఆదివారం శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతూ కొత్త పథకాలు ప్రకటిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేననేది ప్రజలకు తెలిసిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. అధికారంలోకి రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఓడ్నాల రాజేశ్వర్, మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, నాయకులు ఈటల శ్రీనివాస్, సమ్మెట రవి, వినేశ్ పాల్గొన్నారు.