రాహుల్‌‌‌‌ గాంధీని పీఎం చేద్దాం : శ్రీహరి రావు

  •    డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు

నిర్మల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌‌‌‌ గాంధీని ప్రధాన మంత్రిగా చేద్దామని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దిలావర్పూర్ మండలంలోని బీఆర్ఎస్​ లీడర్లు, కార్యకర్తలు ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి శుక్రవారం కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ.. రాహుల్‌‌‌‌ గాంధీ పీఎం అయితేనే ధరల నియంత్రణ ఉంటుందన్నారు.

మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ మాయ మాటలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. నిర్మల్ నియోకజవర్గంలో బీఆర్ఎస్ పనైపోయిందన్నారు. కాంగ్రెస్​లో చేరిన వారిలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, ఎంపీపీ అక్షర అనిల్ కుమార్, రాజేశ్వర్, బాపురావు, వెంకట్ రావు, స్వామి గౌడ్, మహేశ్, శ్రీనివాస్, చిన్నరెడ్డి, సవిత కృష్ణ, సాంబాజీ పటేల్, నర్సారెడ్డి తదితరులు ఉన్నారు. 

లక్ష్మణచాంద, వెలుగు : నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్(డబ్ల్యూ)గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీని వీడి శుక్రవారం డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పడిగల మహిపాల్, రజక సంఘం అధ్యక్షుడు నాంపల్లి రవి, గుర్రం ముత్యం, పుట్టి నరసయ్య, గన్ను సుధీర్ రెడ్డి, వన్నెల ప్రవీణ్, చాంద్ పాషా, పడిగల రమేశ్, ఆవునూరి శ్రీకాంత్, బెల్లం రవి, నాంపల్లి రాజేందర్, మజీద్, రేణి మురళి, గాంధారి రవి తదితరులు ఉన్నారు. 

కడెం,వెలుగు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కల్లెడ మాజీ సర్పంచ్ తాటి సంజీవ్, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొడిమ్యాల నర్సయ్య, నాయకులు చెన్ను మల్లేష్, కందుల సునీల్ కాంగ్రెస్​పార్టీలో చేరారు. కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పొద్దుటూరి సతీశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.