ఆరు గ్యారంటీ స్కీంలను అమలు చేస్తాం : మానాల మోహన్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ  స్కీంలను అమలు చేస్తామని డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో మంగళవారం  పార్టీ ఆఫీస్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం  ఆర్మూరు నియోజకవర్గం నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ  ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఓడించడం ఖాయమన్నారు.  

యూత్ కార్యకర్తలు  ఆరు గ్యారంటీ స్కీంలను గడప గడపకు వెళ్లి వివరించాలన్నారు. వినయ్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు కాంగ్రెస్ లో చేరారు. అనంతరం ఆర్మూర్ టౌన్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొగడమీది బాలకిషన్ ను నియమించారు. కార్యక్రమంలో  గోర్త రాజేంధర్,   కోల వెంకటేష్​,  సాయిబాబా గౌడ్​, ముక్కెర విజయ్, ముప్ప గంగారెడ్డి, విట్టం జీవన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.