
గజ్వేల్, వెలుగు: మన సంస్కృతీ, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలని డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన కైట్ఫెస్టివెల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పతంగులు ఎగురవేశారు.
ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ.. వేల సంవత్సరాలు గడుస్తున్నా మన సంప్రదాయాలు చెక్కుచెదరకుండా ఉండడానికి పండుగలే కారణమన్నారు. కార్యక్రమంలో యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్చైర్మన్సర్ధార్ఖాన్, నాయకులు రంగారెడ్డి, భూమ్‌రెడ్డి పాల్గొన్నారు.