ములుగు/ తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను చింపేసిన బీజేపీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి గూండాగిరిని అదుపు చేయాలని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు. బుధవారం ములుగులో బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు చింపినందుకు నిరసనగా ర్యాలీ నిర్వహించి, అనంతరం డీఎస్పీ రవీందర్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎండీ.చాంద్ పాషా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్సర్ ఖాన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండల కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగా కల్యాణి మాట్లాడుతూ మంత్రి సీతక్క ఫ్లెక్సీలను చింపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు బొల్లు దేవేందర్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.