నీట్ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి : శ్రీహరి రావు

నీట్ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి : శ్రీహరి రావు

నిర్మల్, వెలుగు : జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల్లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరి రావు డిమాండ్ చేశారు. నీట్ అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  శుక్రవారం నిర్మల్​లోని ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందించారు. శ్రీహరి రావు మాట్లాడుతూ నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. పరీక్షను వెంటనే రద్దుచేసి తిరిగి నిర్వహించాలడి డిమాండ్​ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, లైబ్రరీ మాజీ చైర్మన్ ఎర్రబోతు రాజేందర్, టీపీసీసీ సభ్యుడు సాద సుదర్శ న్, పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను తదితరులు పాల్గొన్నారు.