తెలుగు జాతికి గర్వకారణం పీవీ : శ్రీహరి రావు

తెలుగు జాతికి గర్వకారణం పీవీ : శ్రీహరి రావు

నిర్మల్/కోల్​బెల్ట్, వెలుగు: తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాల్లో చాటిన మహా మేధావి పీవీ నరసింహారావు అని, ఆయన సేవలు మరచిపోలేనివని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు కొనియాడారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శాంతినగర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

దేశ రాజకీయాల్లో తెలుగు వారి హుందాతనాన్ని పరిచయం చేసిన వ్యక్తి పీవీ అని, ఊహించని సంస్కరణలు చేపట్టి దారి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన అపర చాణక్యుడని కొనియాడారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు చిన్ను, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మందమర్రి, రామకృష్ణాపూర్​లో కాంగ్రెస్ ​లీడర్లు పీవీ జయంతి వేడుకలు నిర్వహించారు. 

ఆయన ఫొటోలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. పీవీ నరసింహారావు రాష్ట్ర, కేంద్ర మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ సీఎంగా, ప్రధానిగా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి విశేష సేవలందించారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో క్యాతనపల్లి మున్సిపల్​ చైర్ ​పర్సన్​జంగం కళ, మందమర్రి, క్యాతనపల్లి టౌన్​కాంగ్రెస్ ​ప్రెసిడెంట్లు నోముల ఉపేందర్ ​గౌడ్​, పల్లె రాజు, తదితరులు పాల్గొన్నారు.