
సిద్దిపేట, వెలుగు: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రజల్లో విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తెలిపారు.
గురువారం సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ నేతలతో కలసి మర్యాపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో సిద్దిపేట టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గయాజుద్దీన్, ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ రాశాద్ పాల్గొన్నారు.