- డీసీసీ ప్రెసిడెంట్ నర్సారెడ్డి
గజ్వేల్(వర్గల్), వెలుగు: ప్రైవేట్స్కూల్స్కు ధీటుగా గవర్నమెంట్స్కూళ్లను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ ప్రెసిడెంట్ తూంకుంట నర్సారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం బొర్రగూడెం ప్రైమరీ స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ..ఒక గవర్నమెంట్ స్కూల్కు బస్సు ఏర్పాటు చేసి తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడం నిజంగా ఆభినందనీయమన్నారు.
స్కూల్లో ఉన్న గదుల కొరతను పరిష్కరిస్తామన్నారు. అంతకుముందు గజ్వేల్,- తూప్రాన్ రోడ్డు నుంచి వర్గల్ మండలం చందాపూర్ కు వెళ్లే దారిలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. పంచాయతీరాజ్ డీఈ ప్రభాకర్ తో మాట్లాడి దారి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కోరారు. ఆయన వెంట రంగారెడ్డి, మోహన్, రహీం, చెన్నయ్య, కరుణాకర్ ఉన్నారు.