
- డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి
కొండపాక, వెలుగు : తపస్ పల్లి డీ 4 కాల్వల ద్వారా కొండపాక మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి కోరారు. కొండపాక పీఏసీఎస్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటిని అందించకుంటే మండలంలోని రైతులందరితో కలిసి ధర్నా చేపడతామన్నారు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తిమ్మారెడ్డిపల్లి లో నిర్మించాల్సిన ప్రాజెక్టును కుట్రతో తపస్పల్లికి తరలించడంతో కొండపాక మండలానికి అన్యాయం జరిగిందన్నారు. నీరందక వరి ఎండిపోతుందటూ ఆవేదన వ్యక్తం చేశారు. పీఏసీఎస్డైరెక్టర్లు పిస్కా అమరేందర్, సురేందర్‌రావు, నరసింహ చారి,శంభు పాల్గొన్నారు.