కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించిన మాజీ డీసీసీబీ చైర్మన్గంగాధర్ పట్వారీ
బోధన్, వెలుగు: బోధన్ లో బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ తగలనుంది. మున్సిపల్ చైర్పర్సన్తూము పద్మావతి, ఆమె భర్త కౌన్సిలర్ తూము శరత్‌రెడ్డితో పాటు మరో అయిదుగురు కౌన్సిలర్లు వారం కింద బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్చేరగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా వ్యవహరించిన గంగాధర్ పట్వారీ సైతం కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి బుధవారం పట్వారీ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ నెల 27న బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు గంగాధర్ పట్వారీ తెలిపారు.
ALS0 READ: మా భూమి మాకివ్వండి .. కుదబక్షపల్లి రైతులు డిమాండ్