అవిశ్వాసమా.. రాజీనామానా !

అవిశ్వాసమా.. రాజీనామానా !
  • సందిగ్ధంలో డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెజార్టీ డైరెక్టర్లు
  • నలుగురు మాత్రమే బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..

నల్గొండ, వెలుగు : డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొంగిడి మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రాజీనామా చేయాలా ? లేదంటే అవిశ్వాస తీర్మానం ఆమోదించే వరకు వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. సహకార రంగంలో 40 ఏండ్ల అనుభవం ఉన్న మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రస్తుతం సొంత పార్టీ డైరెక్టర్లతోనే పరీక్ష ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఒకే ఒక్క డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుంభం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి 15 మంది డైరెక్టర్లను తన వైపు తిప్పుకోవడంతో మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి డైలమాలో పడ్డారు. ఈ 15 మందిలో వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏసిరెడ్డి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పాశం సంపత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారికంగా చేరగా, మిగతా డైరెక్టర్లు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి శిబిరంలో చేరి పోయారు. 

మొత్తం 19 మంది డైరెక్టర్లలో ప్రస్తుతం మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, అప్పిరెడ్డి, రంగాచారి, పల్లా ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మాత్రమే మిగిలారు. ఏ రకంగా చూసినా అవిశ్వాసాన్ని తప్పించుకునే అవకాశం మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి లేదు. అయినప్పటికీ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి శిబిరంలో ఉన్న పలువురు డైరెక్టర్లతో ఇప్పటికీ టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నారు. అవతలి వర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మెజార్టీ ఉన్నప్పటికీ ఇద్దరు, ముగ్గురు డైరెక్టర్లను తన వైపు తిప్పుకుంటే అవిశ్వాసం వీగిపోతుందన్న ధీమాతో మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఉన్నారు. కానీ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు డీసీసీబీ పీఠాన్ని సొంతం చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు.

28న అవిశ్వాస తీర్మానం

అవిశ్వాస తీర్మానానికి ఇంకా 15 రోజుల టైం ఉంది. డైరెక్టర్లు ఇన్ని రోజుల పాటు క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉంటారన్న నమ్మకం మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్గానికి లేదు. మరికొన్ని రోజులు ఆగితే డైరెక్టర్లు క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండలేక తిరిగి వస్తారని, అప్పుడు అసలు ఆట మొదలు పెట్టాలన్న ఆలోచన మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్గంలో ఉంది. మెజార్టీ డైరెక్టర్లు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి శిబిరంలో ఉన్నందున డీసీసీబీ పదవి నుంచి మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తప్పుకుంటారని అంతా భావించారు. అయితే మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రప్పించేందుకే డీసీసీబీ డ్రామాకు తెరలేపారని ప్రచారం జరిగింది. కానీ మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పార్టీ మారే ఆలోచన చేయకపోవడంతో డైరెక్టర్లు పట్టు బిగించారు.

వేగంగా మారనున్న సమీకరణాలు

మంత్రి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని రావడంతో డీసీసీబీలో ఏం జరుగుతుందోనని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. డీసీసీబీలో జరిగిన అక్రమాల చిట్టాను వైరి వర్గం చేతిలో పెట్టుకుంది. మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వర్గం ఏదైనా తేడా చేస్తే టెస్కాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీసీసీబీలో జరిగిన అక్రమాల భాగోతాన్ని బయటపెడ్తామని చెబుతున్నారు. మాజీ సీఈవో జీతాల స్కాంతో పాటు, మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో జరిగిన అక్రమాలు, యాదగిరిగుట్టలో టెస్కాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్ పేరుతో రూ.10 లక్షలు స్వాహా చేశారని, టెస్కాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.20 కోట్ల స్కాం జరిగిందని, దీనిపై హైకోర్టులో పిల్ కూడా వేశామని డైరెక్టర్లు చెబుతున్నారు. మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి భూఆక్రమణలు, క్రిమినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసుల చిట్టా బయటపెడ్తామని డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇప్పటికే హెచ్చరించారు.