ఆలేరు ఎమ్మెల్యేపై డీసీపీకి ఫిర్యాదు

యాదాద్రి, వెలుగు : ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్​రెడ్డి అధికారులను కోరారు. ఈ మేరకు యాదాద్రి డీసీపీ రాజేశ్​చంద్రను ఆయన కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేవాదాయశాఖ నిబంధనలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వ్యవహరించారని ఆరోపించారు.

గుట్టలో లక్ష్మీనర్సింహస్వామిని మాజీ మంత్రి హరీశ్​రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దర్శించుకున్నారన్న అక్కసుతో ఐలయ్య మాడవీధులను శుద్ధి చేశారని తెలిపారు. దేవాదాయశాఖ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేతోపాటు ఇతర కాంగ్రెస్​లీడర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ లీడర్లు వెంకటయ్య, బీరయ్య, నరహరి, రవీందర్ గౌడ్, రాంరెడ్డి ఉన్నారు.