టెస్కాబ్ చైర్మన్​కు డీసీసీబీ చైర్మన్ విషెస్

నల్గొండ, యాదగిరిగుట్ట, వెలుగు : టెస్కాబ్ కు నూతనంగా ఎన్నికైన చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వైస్ చైర్మన్ సత్తయ్యకు ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు రాజీనామా చేయడంతో ఈనెల 10న కొత్తగా చైర్మన్, వైస్ చైర్మన్ ను ఎన్నుకున్నారు. గురువారం అబిడ్స్ లోని టెస్కాబ్ స్టేట్ ఆఫీస్ లో డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి వారిని మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి విషెస్ చెప్పారు. అనంతరం నిర్వహించిన టెస్కాబ్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు