కాంగ్రెస్‌లోకి డీసీసీబీ చైర్మన్‌ మార్నేని

  •     దాదాపు 100 మంది బీఆర్‌‌ఎస్‌ నాయకుల చేరిక 

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలానికి చెందిన దాదాపు 100 మంది బీఆర్‌‌ఎస్‌ నాయకులు, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌‌ రావు ఆదివారం ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.   జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఎస్. మధు, ఇల్లంద వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కె. స్వామి రాయుడు, మార్కెట్ డైరెక్టర్లు రాజు, జోసెఫ్, సురేశ్ రెడ్డి, ఆత్మ చైర్మన్ యాకుబ్ రెడ్డి, వర్ధన్నపేట బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పులి శ్రీను, మైనార్టీ నాయకుడు అన్వర్ తదితరులు గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. 

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ అరుణ,  కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, కృష్ణారెడ్డి గడ్డం శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట  బీఆర్‌‌ఎస్‌ లో ప్రస్తుతం వైస్ చైర్మన్‌, కొంతమంది కౌన్సిలర్లు మాత్రమే మిగిలారు.