రైతులకు కొత్త క్రాప్ లోన్లు ఇవ్వాలి : డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు

రైతులకు కొత్త క్రాప్ లోన్లు ఇవ్వాలి : డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు
  • రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్  మార్నేని రవీందర్ రావు వెల్లడి

వర్దన్నపేట,(ఐనవోలు)వెలుగు: రుణమాఫీ కింద లబ్ధి పొందిన రైతులకు తిరిగి కొత్తగా క్రాప్ లోన్లు ఇవ్వాలని రాష్ట్ర కో – ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్  చైర్మన్ , డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు తెలిపారు. వరంగల్​జిల్లా  వర్ధన్నపేటలోని డీసీసీబీ బ్యాంక్ లో రాయపర్తి, నందనం, ఐనవోలు, వర్ధన్నపేట సొసైటీలు, ఐనవోలు, వర్ధన్నపేట డీసీసీబీ బ్యాంకుల మేనేజర్లు, నోడల్ అధికారులు, సొసైటీ సిబ్బందితో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.

టెక్నికల్ కారణాలతో పంట రుణమాఫీ కానీ రైతుల అకౌంట్లను మెరుగు పరిచి వెంటనే మాఫీ వర్తించేలా చూడాలని సూచించారు. బ్యాంకు లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని సృష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డిపాజిట్లు, గోల్డ్ లోన్లపై దృష్టి సారిస్తూ బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో నోడల్ అధికారి ఏజీఏం గొట్టం స్రవంతి, బ్రాంచ్ మేనేజర్లు సమత, సొసైటీల చైర్మన్లు, సిబ్బంది పాల్గొన్నారు.