బీఆర్ఎస్​కు డీసీసీబీ చైర్మన్ రాజీనామా

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్​కు షాక్ తగిలింది. ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి వెల్లడించారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్​లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్క్షతలు తెలియాజేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా ఆయన కాంగ్రెస్​లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.