
పాన్గల్, వెలుగు: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని డీసీసీబీ ఛైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్ అన్నారు. ఆదివారం గోప్లాపూర్, దావాజీ పల్లి, మహమ్మదాపూర్, కేతెపల్లి, తెల్ల రాళ్లపల్లి, రేమద్దుల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, గన్నీ బ్యాగులు ఏర్పాటు చేయాలని సూచించారు.
తేమ విషయంలో అన్నదాతలను ఇబ్బంది పెట్టొద్దని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ వెంకటేశ్ నాయుడు, మాజీ జడ్పీటీసీ రవి, నాయకులు బ్రహ్మయ్య, పుల్లారావు, భాస్కర్ యాదవ్, విండో వైస్ చైర్మన్ బాలయ్య, సీఈవో భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.