శ్రీనివాస్ రెడ్డికి కుటుంబం కంటే ప్రజలే ఎక్కువ : పోచారం భాస్కర్ రెడ్డి

బాన్సువాడ, వెలుగు :  తన తండ్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కుటుంబ సభ్యుల కంటే ప్రజల మీదే ప్రేమ ఎక్కువ అని డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన పోచారం తరఫున మూడో సెట్ నామినేషన్ దాఖలు చేసి విలేకరులతో మాట్లాడారు. నెలలో 29 రోజులు ప్రజల కోసం పనిచేస్తారని, ఒక్కరోజు మాత్రమే కుటుంబానికి కేటాయిస్తారన్నారు.

ఇక్కడి ఎన్నికల్లో పోచారంపై పోటీగా బయటి వారు వస్తున్నారని, వారిని తిరస్కరించాలని కోరారు. 74 ఏండ్ల వయసులోనూ పోచారం యువకుడిలా పని చేస్తున్నారన్నారు. సమావేశంలో గురువు వినయ్ కుమార్, నాగుల గామ వెంకన్న, నారాయణ్​రెడ్డి, శ్యామల పాల్గొన్నారు.