
కంది, వెలుగు : సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాల్సిందేనని డీసీసీబీ వైస్ చైర్మన్పట్నం మాణిక్యం డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డిలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు నిరాశకు గురి కావొదు.. సంగారెడ్డిలో బీఆర్ఎస్ టికెట్ సాధించి సీఎం కేసీఆర్‌కు గులుపును గిఫ్ట్ ఇవ్వడానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆరోగ్యం సరిగా లేని వ్యక్తికి టికెట్ ఇస్తే ఎలా గెలుస్తాడని విమర్శించారు. సంగారెడ్డి టికెట్‌విషయంలో సీఎం కేసీఆర్ పునరాలోచించుకోవాలని, ఇక్కడ టికెట్ఆశిస్తున్న వారిలో ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామని తెలిపారు. సమావేశంలో కొండాపూర్ ఎంపీపీ మనోజ్‌రెడ్డి, వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మల్లేశం, కార్యకర్తలు పాల్గొన్నారు.