గచ్చిబౌలి, వెలుగు: డీసీఎం ఢీకొట్టడంతో బైక్ మీద వెళ్తున్న ఐటీ ఉద్యోగి మృతి చెందాడు. ఏపీలోని ఏలూరుకు చెందిన పైడి యశ్వంత్ సాయిశంకర్(24) హఫీజ్ పేట్ పరిధిలోని కేఎస్ఆర్ ఎంపైర్‌లో నివాసం ఉంటూ.. నానక్ రాంగూడలోని ఏడీపీ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం డ్యూటీ ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, గచ్చిబౌలిలోని ప్లాటినా వద్ద వెనుక నుంచి డీసీఎం ఢీకొని మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు దాటుతూ మహిళ..
శంషాబాద్: రోడ్డు దాటుతూ మహిళ మృతి చెందిన ఘటన మైలార్ దేవ్పల్లిలో జరిగింది. బాబుల్ రెడ్డి నగర్‌కు చెందిన శాంతి (35) భర్త శ్రీనుతో కలిసి కూలీ పనులు చేసుకుంటోంది. శనివారం ఉదయం కాటేదాన్‌కు పని కోసం బయలుదేరింది. బాబుల్ రెడ్డి నగర్ హైవేపై రోడ్డు దాటుతున్న క్రమంలో బైక్ ఢీకొని తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానికులు ఉస్మానియా దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఎక్సల్‌పై వెళ్తూ రైతు..
వికారాబాద్: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బూచన్ పల్లికి రైతు శ్రీకాంత్ (35) పని మీద టీవీఎస్ ఎక్సల్‌పై బయటకు వెళ్లాడు. పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, కుడుగుంట వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటనపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.