రోడ్డు పక్కకు దూసుకెళ్లిన డీసీఎం .. 20 బైకులు ధ్వంసం

మేడ్చల్ జిల్లా  ఘట్ కేసర్ లో వరంగల్ జాతీయ రహదారిపై   డీసీఎం బోల్తాపడింది.  అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునూతల గ్రామానికి 35 మంది  యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్లి  వస్తుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. రహదారి పక్కనే ఘట్టు మైసమ్మ జాతర ఉండడంతో  పార్కింగ్ చేసిన వాహనాలను ఢీ కొట్టి బోల్తాపడింది. 

 ఈ ఘటనలో డీసీఎంలో ఉన్న కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సుమారు 20 ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.