సిరిసిల్ల జిల్లాలో డీసీఎం బోల్తాతో పట్టుబడిన పీడీఎస్ రైస్

సిరిసిల్ల జిల్లాలో డీసీఎం బోల్తాతో పట్టుబడిన పీడీఎస్ రైస్

కొండపాక, వెలుగు : డీసీఎం బోల్తాపడడంతో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్​రైస్​వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా  కొండపాక మండలం దుద్దెడలో జరిగింది. సీఐ విద్యాసాగర్ కథనం ప్రకారం.. బుధవారం ఉదయం దుద్దెడ గ్రామ స్టేజీ వద్ద సిద్దిపేట వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం  బోల్తాపడి  అందులో ఉన్న బియ్యం సంచులు కింద పడిపోయాయి.

పోలీసులు పీడీఎస్ రైస్ ను తరలిస్తుండగా ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల గ్రామనికి చెందిన తాళ్లపల్లి రాజు తక్కువ ధరకు రేషన్ బియ్యన్ని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మడానికి వికారాబాద్​కు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు, క్లీనర్ నితిన్ కుమార్ గాయపడగా అందులోని 140  క్వింటాళ్ల బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.