నల్గొండ దేవరకొండలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడిక్కడే మృతి

నల్గొండ దేవరకొండలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు  అక్కడిక్కడే మృతి

నల్లగొండ జిల్లా   దేవరకొండ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది.   పెద్ద దర్గా దగ్గర మిఠాయి దుకాణంలోకి డీసీఎం దూసుకెళ్లింది. ఈ ఘటనలో  ముగ్గురు వ్యక్తులు  అక్కడిక్కకడే మృతి చెందారు.   మృతులు ఉర్సు ఉత్సవాల దగ్గర మిఠాయి విక్రయిస్తున్న చిరు వ్యాపారులు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 మృతులు  నాగరకర్నూల్  జిల్లా తాండూరుకు చెందిన అబ్దుల్ ఖాదర్, దేవరకొండ మండలం  తాటికోల్  గ్రామానికి చెందిన   హాజీ, డిండి మండలం  ఎర్రారం  నబీన గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.