జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆవులతో వెళ్తున్న డీసీఎం బోల్తాపడింది. ఈ ఘటనలో 40 కి పైగా అవులు అక్కడికక్కడే మృతి చెందాయి. 60కి పైగా ఆవులకు తీవ్రగాయాలయ్యాయి.
స్థానికుల సహాయంతో ఆవులను బయటకి తీశారు పోలీసులు. దాదాపు 100కు పైగా ఆవులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అర్థరాత్రి హైదరాబాద్ కు అక్రమంగా ఆవులను తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.