స్నేహితులను బలిగొన్న డీసీఎం వ్యాన్

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లి మండలం రాగోజిపేటకు చెందిన అభిషేక్(22), భీమారానికి చెందిన మోయిన్ ఖాన్(21), వరుణ్ సందీప్ లు స్నేహితులు. వీరు ముగ్గురు కొడిమ్యాలలో క్యాటరింగ్ కి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నారు. కోడిమ్యాల మండలం కోనాపూర్ శివారుకి రాగానే డీసీఎం వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణం విడిచారు. చేతికందివచ్చిన కుమారులు అర్ధాంతరంగా తనువు చాలించడంతో వారి తల్లిదండ్రులు కన్నీరు  మున్నీరుగా విలపిస్తున్నారు. యువకుల మృతితో స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.