కరీంనగర్ క్రైమ్, వెలుగు: ఆటో డ్రైవర్స్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, డాక్యుమెంట్లు కలిగి ఉండాలని డీసీపీ ఎ. లక్ష్మి నారాయణ తెలిపారు. స్థానిక జాన్ విల్సన్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఆటో డ్రైవర్లకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆటో వెనక టాప్ నెంబర్ తప్పక ఉండాలన్నారు. లేనివారు ట్రాఫిక్ పోలీసులను సంప్రదించి, నెంబర్ పొందాలని చెప్పారు. కార్యక్రమంలో ఏసీపీలు నరేందర్, కరుణాకర్ రావు , ఇన్స్పెక్టర్ రవికుమార్ , ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు రమేశ్, ఖరీముల్లాఖాన్ పాల్గొన్నారు.