
సిద్దిపేట రూరల్, వెలుగు : ఈ చలాన్లు పెండింగ్లో ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిందని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బైక్ లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు, ఆటోలకు 90 శాతం రాయితీ, నాలుగు చక్రాల వాహనాలకు, లారీలకు, భారీ వాహనాలకు 60 శాతం రాయితీ కల్పించిందన్నారు.