బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌ను శుక్రవారం సాయంత్రం మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఖాళీగా ఉన్న క్వార్టర్స్ ను పరిశీలించారు. హెడ్ క్వార్టర్స్ పూర్తిస్థాయిలో ఆధునికీకరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ హెడ్ క్వార్టర్స్ ను ఇక్కడే కొనసాగించేందుకు అనుకూల వాతావరణం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ ఎస్.సురేంద్రను ఆదేశించారు. డీసీపీ వెంట బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్, ఏఆర్ ఎస్ఐలు వామన మూర్తి, సంపత్, బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ డి.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
లైకాకు నివాళి
బెల్లంపల్లి పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో డాగ్ స్క్వాడ్ విభాగానికి చెందిన లైకా అనే డాగ్ తీవ్ర అనారోగ్యానికి గురై శుక్రవారం మృతి చెందింది. 2015 బ్యాచికి చెందిన లైకా ఎన్నో కేసులు ఛేదించడంతో సహకరించింది. అధికార లాంఛనాలతో జరిగిన లైకా అంత్యక్రియల్లో డీసీపీ పాల్గొన్నారు.