బీఆర్​ఎస్ ​సభా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ

జన్నారం, వెలుగు : ఈ నెల 17న జన్నారం మండల కేంద్రంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభా స్థలాన్ని మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్ నాథ్ కేకన్​తోపాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, బీఆర్ఎస్ ఖానాపూర్ అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ పరిశీలించారు.

కేటీఆర్​ హాజరుకానున్న ఈ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, వెహికల్ పార్కింగ్ ఏర్పాటుపై చర్చించారు. డీసీపీ వెంట మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, లక్సెట్టిపేట సీఐ కృష్ణ, స్థానిక జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ రాజారాంరెడ్డి తదితరులున్నారు.

ALSO READ : బీఆర్ఎస్ పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది : జాన్సన్ నాయక్