భువనగిరి విద్యార్థినిల సూసైడ్ పై డీసీపీ రాజేష్ చంద్ర స్పందించారు. ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆత్మహత్య చేసుకున్న భవ్య, వైష్ణవి కేసులో కీలక మైన పీఎంఈ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. ఇప్పటికే కేసుకు సంబంధించి సూసైడ్ లేఖను, హాస్టల్లో ఉన్న బాలికల వాంగ్మూలంను సేకరించామని అన్నారు. వాటన్నిటినీ సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు.
చాలామంది సోషల్ మీడియాలో తోచిన విధంగా పోస్టులు పెడుతున్నారని అమ్మాయిల గురించి కామెంట్లు చేయవద్దని, ఇది సున్నిత మైన అంశమని డీసీపీ అన్నారు. ఈ కేసులో చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్లు కూడా స్టేట్మెంట్ లను రికార్డు చేస్తున్నారని చెప్పారు. వారి రికార్డులను కూడా కోర్టుకు పంపిస్తామని తెలిపారు. విచారణ పకడ్బందీగా జరుగుతుందని అన్నారు.
ALSO READ :- Valentines Day : 500 రూపాయల్లో ప్రేమికుల బెస్ట్ బహుమతులు
కేసులో అపోహలు, ఇతర కథనాలు నమ్మవద్దని సూచించారు. నిజాయితీగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని చెప్పారు. సున్నిత మైన అంశం కావటంతో రిపోర్ట్ లోని అంశాలను బహిర్గతం చేయమని డీసీపీ తెలిపారు.