మత్తు వదలరా బాబు..సన్మార్గంలో నడవండి

మత్తు వదలరా బాబు..సన్మార్గంలో నడవండి

బాచుపల్లి: జీవితంలో ఏం సాధించాలన్నా యుక్త వయసు ఎంతో ముఖ్యమైనదని.. అలాంటి వయసులో చెడు మార్గంలో వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి. శుక్రవారం ఆమె.. బాచుపల్లి సిల్వర్ ఓక్ పాఠశాలలో జరిగిన డ్రగ్స్ అవగాహన సదస్సుల్లో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్న శిల్పవల్లి.. సన్మార్గంలో నడుస్తూ ఉన్నత శ్రద్దగా చదువుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ప్రస్తుత సమాజంలో యువత చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు బానిసై తప్పుదారిలో నడుస్తుందని.. దీనివల్ల సమాజంలో చెడువారిగా, కుటుంబంలో గౌరవం లేని వారిగా మిగిలిపోతారన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదని.. తల్లిదండ్రులు చెప్పిన మాట విని ఉన్నతంగా చదువుకుని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు డీసీపీ శిల్పవల్లి.

మరిన్ని వార్తల కోసం

సర్ఫ్, నూనె, కెమికల్స్​తో పాల తయారీ

పెళ్లికి పెట్రోల్, డీజిల్ బాటిళ్లు గిఫ్ట్ గా ఇచ్చిన ఫ్రెండ్స్