కోల్బెల్ట్, వెలుగు: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని -మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. శుక్రవారం మందమర్రి సీఐ ఆఫీసులో మందమర్రి, రామకృష్ణాపూర్ పీఎస్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ నేర ప్రవర్తనను మార్చుకోవాలని, ప్రతి ఒక్కరి కదలికలపై నిఘా పెట్టామన్నారు. గొడవలకు దిగితే పీడీ యాక్టు పెడతామని హెచ్చరించారు. ఎలక్షన్స్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవదద్దని సూచించారు.
ముందస్తు చర్యలలో భాగంగా వారిని మందమర్రి తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఐ మహేందర్రెడ్డి, ఎస్సైలు చంద్రకుమార్, హరిశేఖర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.