మేడారంలో ప్రముఖుల పూజలు

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మను శుక్రవారం టెక్స్‌‌టైల్‌‌ మంత్రిత్వ శాఖ డీడీ అరుణ్‌‌కుమార్‌‌ దర్శించుకున్నారు. ఆయన ఆలయ ఆఫీసర్లు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అమ్మవారి గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠితో కలిసి గిరిజన మ్యూజియం, హరిత హోటల్‌‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అరుణ్‌‌కుమార్‌‌ మాట్లాడుతూ వచ్చే నెల 21, 22, 23 తేదీల్లో జరిగే మహా జాతరలో ట్రైబల్‌‌ ఆర్ట్, హ్యాండ్లూమ్‌‌, హ్యాండీక్రాఫ్ట్స్‌‌ను ప్రదర్శించనున్నట్లు చెప్పారు.

సెంట్రల్ టెక్స్‌‌టైల్‌‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో థీమ్‌‌ పెవిలియం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో సత్యపాల్‌‌రెడ్డి, ఈవో రాజేంద్రం, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, డీపీవో వెంకయ్య, ఐటీడీఏ ఎస్‌‌వో రాజ్‌‌కుమార్‌‌, మ్యూజియం అసిస్టెంట్‌‌ క్యూరేటర్‌‌ కురుసం రవి ఉన్నారు. అలాగే డిప్యూటీ సోలిసిటర్ గాడి ప్రవీణ్‌‌కుమార్‌‌ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట తాడ్వాయి తహసీల్దార్‌‌ తోట రవీందర్, ఆర్‌‌ఐ సునీల్‌‌ ఉన్నారు.