హైదరాబాద్: బల్దియా సర్కిల్ ఆఫీసులో డీడీల గోల్ మాల్‌పై ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యులైన ఐదుగురు అధికారులను కమిషనర్లోకేష్ కుమార్ సస్పండ్ చేశారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత మరికొందరిపై వేటు పడే అవకాశం ఉంది. మూసాపేట్సర్కిల్లోని ఇంజనీరింగ్విభాగంలో సూపరింటెండెంట్పద్మావతి, హెడ్ డ్రాఫ్ట్ మెన్ శ్రావణి కాంట్రాక్టర్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్కోసం సేకరించిన 146 డీడీలను పక్కదారి పట్టిచ్చినట్లు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ. 40 లక్షలుగా ఉంది. మరో 119 డీడీల్లో రూ. 39 లక్షలకు పైగా ఉంది. వీరితో పాటు బిల్ కలెక్టర్రాజ్ కుమార్ 71 డీడీలకు సంబంధించి రూ. 22 లక్షలకు పైగా విలువైన డీడీలను ప్రాపర్టీ ట్యాక్స్విభాగంలో జమ చేసినట్లు వెల్లడైంది. మరో బిల్ కలెక్టర్ నరేష్ 7 డీడీలకు సంబంధించి సుమారు రూ. 3 లక్షలకు జమ చేసినట్లు గుర్తించారు. కూకట్ సర్కిల్ బిల్ కలెక్టర్ కిరణ్ కుమార్ మూసాపేట్సర్కిల్లోని 24 డీడీలకు సంబంధించి దాదాపు రూ. 10 లక్షలకు డిపాజిట్ చేసినట్లు తేలింది. వీరిపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
అన్ని సర్కిల్స్‌పై ఫోకస్
మూసాపేట్ సర్కిల్లో ప్రాథమిక విచారణలోనే లక్షలాది రూపాయల గోల్ మాల్ జరిగినట్లు గుర్తించగా, మిగతా సర్కిళ్లలోనూ ఇలానే జరిగి ఉండొచ్చనే అనుమానాలున్నాయి. మూసా పేటలో విచారణ మాదిరిగా అన్ని చోట్లా చేస్తే మరికొందరు అక్రమార్కులు దొరికే అవకాశముందని బల్దియా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనిపై ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం.