ఢిల్లీ: దేశ దేశధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆంక్షల కారణంగా కొవిడ్ బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఢిల్లీలో తాజాగా 7,498 మందికి కరోనా సోకింది. గత 24 గంట్లోల 11,164 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 29 మంది చనిపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 10.59శాతంగా ఉండగా.. 38,315 యాక్టివ్ కేసులున్నాయి.
ఢిల్లీలో కరోనా తీవ్రత తగ్గుతుండటంతో త్వరలోనే ఆంక్షల్ని సడలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ సర్కారు ఇప్పటికే వీకెండ్ లాక్ డౌన్, సరి బేసి విధానంలో షాపులు తెరవడాన్ని ఎత్తివేయాలని సూచించింది. ఈ అంశంపై వర్తక సంఘాలు సైతం లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశాయి. ఈ క్రమంలో గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నేతృత్వంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సమావేశం కానుంది. కరోనా పరిస్థితులను సమీక్షించి ఆంక్షల సడలింపుపై నిర్ణయం వెలువరించనుంది. సీఎం కేజ్రీవాల్ కూడా పాల్గొనే ఈ మీటింగ్ లో ఫిబ్రవరి నుంచి స్కూళ్లు తిరిగి తెరిచే అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.