ఏసీబీకి చిక్కిన కాప్రా సర్కిల్ డీఈ మహాలక్ష్మి

ఏసీబీకి చిక్కిన కాప్రా సర్కిల్ డీఈ మహాలక్ష్మి

GHMC కాప్రా సర్కిలో D.E మహాలక్ష్మీ 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇటీవల మహిళా స్వీపర్ సాలెమ్మ భర్త అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో భర్త జాబ్ ను సాలెమ్మకు ఇచ్చారు. అయితే స్వీపర్ సాలెమ్మ ఉద్యోగాన్ని కొనసాగించేందుకు  D.E మహాలక్ష్మీ లంచం అడిగారు. మల్లాపూర్ లోని ఓ హోటల్ లో 20 వేలు లంచం తీసుకుంటుండగా ఆమెను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహాలక్ష్మి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు ACB అధికారులు.