![డీఈ షా ఎదగడాన్ని 20 ఏళ్లుగా చూస్తున్నాం](https://static.v6velugu.com/uploads/2022/09/de-shaw-second-office-opened-in-hyderabad_eXgQL5qMuv.jpg)
హైదరాబాద్, వెలుగు: డీఈ షా గ్రూప్ కంపెనీ డీఈ షా ఇండియా హైదరాబాద్ లో మరో ఆఫీస్ ను ఓపెన్ చేసింది. సిటీలో ఈ కంపెనీ తన సర్వీసులు స్టార్ట్ చేసి 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ వచ్చారు. హైదరాబాద్ లో డీఈ షా ఎదగడాన్ని గత 20 ఏళ్లుగా చూస్తున్నానని, ఫైనాన్షియల్ సెక్టార్ లో కీలకమైన కంపెనీగా మారిందని జయేష్ రంజన్ అన్నారు.
హైదరాబాద్ లో కొనసాగుతున్న తమ ఇన్వెస్ట్ మెంట్లకు ఈ కొత్త ఆఫీస్ నిదర్శనం అని డీఈ షా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఎడ్డీ ఫిష్మన్ అన్నారు. దేశంలో మొదటిలో కార్యకలాపాలు స్టార్ట్ చెసిన గ్లోబల్ ఫైనాన్షియల్ కంపెనీల్లో తాము ఒకరమని, భారీగా వృద్ధి చెందామని పేర్కొన్నారు. కొత్త ఆఫీస్ ను పాత ఆఫీస్ కు పక్కన ఐవీవై బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. ఈ ఆఫీస్ లో 400 మంది ఉద్యోగులు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరో 200 మంది ఉద్యోగుల కోసం ఆఫీస్ ను విస్తరించవచ్చని కంపెనీ ఓ స్టేట్ మెంట్ లో పేర్కొంది.