డి సన్స్ పటోలా వస్త్ర ప్రదర్శన షురూ

డి సన్స్ పటోలా  వస్త్ర ప్రదర్శన షురూ

బంజారాహిల్స్‌‌, వెలుగు: బంజారాహిల్స్‌‌‌‌ రోడ్ నంబర్1లోని లేబుల్స్ పాప్ -అప్ స్పేస్ లో ఏర్పాటు చేసిన ‘ది సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శనను సామాజికవేత్త అలేఖ్యా రెడ్డి ఆదివారం ప్రారంభించారు.  విభిన్నమైన హ్యాండ్లూమ్ చీరలతోపాటు పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్, సిల్క్ ఉత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమన్నారు. 

నేరుగా వీవర్ నుంచి కస్టమర్​కు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ సందర్శించి, చేనేతకారులను ప్రోత్సహించాలని కోరారు. డి సన్స్ పటోలా ఆర్ట్స్ నిర్వాహకులు భవిన్ మాట్లాడుతూ.. ఈ నెల 27 వరకు  ప్రదర్శన కొనసాగుతుందని  తెలిపారు.